Top Ad unit 728 × 90

వధశాలకు తరలిస్తున్న గోవుల పట్టివేత

(నూజివీడు,): వధ శాలకు తరలిస్తున్న గోవులను వైయస్సార్ సిపి నేత పగడాల సత్యనారాయణ నిలిపి గోసంరక్షణ శాల కు తరలిస్తున్న వైనం నూజివీడు లో చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం మీదుగా మంగళవారం నాడు 8 గోవులను నిర్ధాక్షణ్యంగా వ్యానులో కట్టిపడేసి వధ శాలకు తరలిస్తుండగా వైయస్సార్ సిపి నేత పగడాల సత్యనారాయణ వ్యాను నిలుపుదల చేశారు. గోవులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్ఐ ఏ గణేష్ కుమార్ ఈ ఘటనపై వెంటనే స్పందించి గోవులను తరలించే వ్యాన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వ్యాను డ్రైవర్ నుండి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఏ విధమైన ఆధారాలు లేకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేత, పట్టణ ఐదో వార్డ్ కౌన్సిలర్ పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల లో భాగమైన గోమాతను వధ శాలకు తరలించడం, విచక్షణారహితంగా గోవులను బంధించడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను పూజించకపోయిన,సాటి జీవిగా గుర్తించాలన్నారు. స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసి, పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల పుణ్య క్షేత్రానికి సంబంధించిన గో సంరక్షణ శాలకు గోవులను తరలించడం ఉన్నట్లు        పగడాల సత్యనారాయణ తెలిపారు. ఇకపై పట్టణం నుండి అక్రమంగా గోవుల తరలింపును అడ్డగిస్తామని, ఎందుకు యువతరం నడుం బిగించాలని అన్నారు. దీనిపై స్థానిక శాసనసభ్యులు మేకా ప్రతాప్, ప్రభుత్వ అధికారులతో కార్యాచరణ రూపొందించనున్నట్లు పగడాల సత్యనారాయణ విలేకరులకు వివరించారు.

వధశాలకు తరలిస్తున్న గోవుల పట్టివేత Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *