చిత్తపూరు నకిలీ అభ్యర్థులపై విచారణకు ఆదేశం
చిత్తపూరు నకిలీ అభ్యర్థులపై విచారణకు ఆదేశం....
*నూజివీడు*: చిత్తపూరులో సర్పంచ్ అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదు లో తక్షణమే విచారించి తగిన చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్ రవీంద్రబాబు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు ఆదేశాలు జారీ చేశారు.కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు నియోజకవర్గం లో గల చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులుగా తిరి వీధి రమేష్, అతని భార్య విజయ కుమారి లు నామినేషన్ దాఖలు చేశారు. వీరు ఇరువురు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకొని బి సి సి కేటగిరీకి చెందిన వారు. ఎస్సీ రిజర్వుడ్ అయిన చిత్త పూరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులుగా ఏ విధంగా పోటీ లో ఉంటారని, నకిలీ కుల ధ్రువపత్రం తో పోటీ చేస్తున్నారని సమాచార హక్కు చట్టం ప్రచార సమితి అధ్యక్షులు టి కృష్ణ ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆధారాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్ రవీంద్రబాబు చిత్త పూరు నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి, సర్పంచి పోటీలో ఉన్న తిరివీధి రమేష్, అతని భార్య విజయ కుమారి ల వ్యవహారంపై తక్షణమే విచారించి, తగిన చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఫిర్యాదుదారుకు కూడా ఉత్తర్వులు కాపీ నకలును ఎలక్షన్ కమిషన్ నుండి పంపించడం జరిగింది.
*తీవ్ర సంచలనం కలిగిస్తున్న చిత్తపూరు*: ఈ వ్యవహారం మొత్తం చాట్రాయి మండలం లో, కృష్ణాజిల్లాలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగో విడత నూజివీడు రెవెన్యూ డివిజన్ లో కొనసాగుతూ ఉండడంతో అధికారులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు, రాజకీయ విశ్లేషకులు సైతం చిత్తపూరు ఘటనలో ఏ క్షణం ఏమి జరగనుందని ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ జాయింట్ సెక్రటరీ నుండి తక్షణమే విచారించి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అందడంతో చిత్త పూరు రాజకీయం మరింతగా రాజుకుని ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నిక జరిగినా.... జిల్లా కలెక్టర్ విచారణతో తిరివీధి రమేష్, అతని భార్య విజయ కుమారి లు ఇద్దరూ ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలకు గురికాక తప్పదని గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
