Top Ad unit 728 × 90

వైరస్‌కు వైరస్‌తోనే కట్టడి...!

వైరస్‌కు వైరస్‌తోనే కట్టడి...!

 

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను కట్టడి చేయడానికి ఆ సూక్ష్మజీవినే సాధనంగా ఉపయోగించుకునే వినూత్న విధానాన్ని అమెరికాలోని 'ద స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌' శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. ఇందుకోసం వారు ఎన్‌ఎంటీ5 అనే సరికొత్త ఔషధాన్ని కనుగొన్నారు. కరోనాలో కొత్తగా వస్తున్న వేరియంట్లపైనా ఇది సమర్థంగా పనిచేసే అవకాశం ఉందని వివరించారు. ఎన్‌ఎంటీ5లో రెండు కీలకమైన లక్షణాలు ఉన్నాయి. 1. ఇది వైరస్‌ ఉపరితలంపై ఉన్న ఒక రంధ్రాన్ని గుర్తించి, దానికి అంటుకోవడం. 2. నైట్రోగ్లిజరిన్‌ను ఉపయోగించుకొని మానవుల్లోని ఏసీఈ2 గ్రాహకాన్ని తాత్కాలికంగా రసాయనపరంగా మార్చివేయడం. కరోనా వ్యాప్తి కట్టడికి ఈ రెండు లక్షణాలు బాగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తొలుత ఈ మందు. కరోనా వైరస్‌పై రసాయన పూతను వేస్తుంది. ఫలితంగా అది మానవ ఏసీఈ2 రెసెప్టార్‌ను తాత్కాలికంగా మార్చేస్తుంది. మన కణాల్లోకి ప్రవేశించడానికి ఈ భాగాన్నే వైరస్‌ ఉపయోగించుకుంటుంది. ఈ మందును కలిగిన వైరస్‌ తన సమీపానికి వస్తే కణంలోకి ప్రవేశించే మార్గాన్ని ఈ రెసెప్టార్‌ మూసేస్తుంది. దగ్గరకు రాకుంటే తన పని తాను చేసుకుపోతుంది.

 

వైరస్‌కు వైరస్‌తోనే కట్టడి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *