Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

త్వరలో చందమామపై 4జీ సేవలు...!

త్వరలో చందమామపై 4జీ సేవలు...!

 

మరోసారి చంద్రుడిపై కాలు మోపేందుకు మానవ ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా చంద్రుడిపైకి 2024లో వ్యోమగాములను పంపనున్నట్లు నాసా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మానవులు జీవించేందుకు చంద్రుడిపై ఉన్న వాతావరణం అనువైనదిగా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. అయితే, తాజాగా చంద్రునిపై ఏకంగా 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ సేవలను కూడా ప్రారంభించేందుకు నాసా ఒక ప్రాజెక్టును చేపట్టింది. దీనికి గాను నోకియా రీసెర్చ్ విభాగమైన బెల్ ల్యాబ్స్‌తో జతకట్టింది నాసా. నూతన ప్రాజెక్టుకు సంబంధిన విషయాలను నాసా, బెల్ ల్యాబ్స్ అక్టోబర్ 15 అధికారికంగా వెల్లడించాయి. ప్రాజెక్టుకు గాను మొత్తం 370 మిలియన్ డాలర్లను వెచ్చించనుంది. ఇందులో భాగంగా 4జీ సర్వీసులను చంద్రుడిపై తీసుకురావడానికి ఫిన్నిష్ టెలికమ్యూనికేషన్ సంస్థకు 14.1 మిలియన్ల డాలర్లను అందించనుంది. దీనిపై బెల్ ల్యాబ్స్ ట్వీట్ చేస్తూ "చంద్రుని కోసం 'టిప్పింగ్ పాయింట్' టెక్నాలజీస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు, చంద్రునిపై స్థిరమైన మానవ ఉనికిని మార్గం సుగమం చేసేందుకు నాసా మాతో జతకట్టడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం చంద్రునిపై 4G / LTE టెక్నాలజీస్‌ను ప్రారంభించి, తర్వాత 5G సేవలను కూడా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నాం. చంద్రునిపై మొదటి వైర్లెస్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి మా ఆవిష్కరణలు ఉపయోగించబడతాయి." అని పేర్కొంది. ప్రాజెక్టుపై నాసా స్పేస్ టెక్నాలజీ మిషన్ పర్యవేక్షకుడు జిమ్ రౌటర్ మాట్లాడుతూ 'చంద్రునిపై సెల్యులార్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో వ్యోమగాములు, రోవర్లు, నివాసితుల మధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. చంద్రుడిపై ఉండే వాతావరణానికి అనుగుణంగా భూమిపై ఉన్న 4జీ టెక్నాలజీని ఎలా అందించవచ్చో నోకియా పరిశీలిస్తుంది అని అన్నారు.నాసా తన 'ఆర్టెమిస్ లూనార్ ఎక్స్‌ప్లొరేషన్' కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికను గత నెలలో ప్రచురించింది. దీనిలో భాగంగా 2024 నాటికి ఇద్దరు అమెరికన్ వ్యోమగాములను చంద్రునిపైకి పంపించనున్నట్లు పేర్కొంది. అయితే, వీరిలో ఒక మహిళా వ్యోమగామి కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. వ్యోమగాములతో చంద్రుని ఉపరితలంపై ఉన్న పరిస్థితులను తెలుసుకొని, 2028 నాటికి చంద్ర మండలంపై జీవించడానికి వీలుగా "స్థిరమైన" వాతావరణాన్ని ఏర్పరచాలని నాసా యోచిస్తోంది.

త్వరలో చందమామపై 4జీ సేవలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *