Top Ad unit 728 × 90

కొత్తవి ఇవ్వడం లేదా ఉచితంగా పరిష్కరించనున్న యాపిల్...!

కొత్తవి ఇవ్వడం లేదా ఉచితంగా పరిష్కరించనున్న యాపిల్...!

 

యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రోలో ఇటీవల సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. సౌండ్ పరంగా సమస్యలు వస్తున్నాయని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. విషయాన్ని యాపిల్ సంస్థ కూడా ధృవీకరించింది. తక్కువ శాతంలో యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో యూనిట్లలో సౌండ్ సమస్యలు వచ్చాయని స్పష్టం చేసింది. సమస్య తలెత్తిన యూనిట్లు అక్టోబర్ 2020 కంటే ముందు తయారు చేసినవని యాపిల్ సంస్థ తెలిపింది. సమస్యలు తలెత్తాయని చెబుతున్న యూజర్ల కోసం యాపిల్ ప్రత్యేకమైన సర్వీస్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసింది. యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రోలో సమస్యలు తలెత్తుతూ ఉన్నట్లయితే తమను సంప్రదించాలని కోరింది. అందులో ఉన్న సమస్యను పరిష్కరించడం కానీ వాటి స్థానంలో కొత్తవి ఇవ్వడం కానీ జరుగుతుందని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది. దీని కోసం యాపిల్ సంస్థ ఎటువంటి ఫీజులు వసూలు చేయదని తెలిపింది. ప్రోగ్రాం కోసం యాపిల్ సంస్థ ప్రత్యేకమైన పేజీని కూడా ఏర్పాటు చేసింది. యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రోలో ఎటువంటి సమస్యలు తలెత్తినా సంప్రదించాలని తెలిపింది. యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో ను కొన్న రెండు సంవత్సరాల వరకూ సదుపాయం అందుబాటులో ఉండనుంది. యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో యూనిట్లలో క్రాక్లింగ్ సౌండ్, స్టాటిక్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. శబ్దం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, వ్యాయామం చేస్తున్న సమయంలోనూ, ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో సౌండ్ పరమైన సమస్యలు తలెత్తుతూ ఉండడంతో యూజర్లు విషయాన్ని యాపిల్ దృష్టికి తీసుకుని వచ్చింది. దీంతో యాపిల్ దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టింది.

 

కొత్తవి ఇవ్వడం లేదా ఉచితంగా పరిష్కరించనున్న యాపిల్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *