Top Ad unit 728 × 90

కరోనా బారి నుంచి కాపాడమని అరుణాచలేశ్వరుడి కరుణ చూపమని...!

కరోనా బారి నుంచి కాపాడమని అరుణాచలేశ్వరుడి కరుణ చూపమని...!

 

కనుమూరి మాధవి (అరుణాచల మాధవి) ఈ పేరు ప్రతి అరుణాచలేశ్వరుడి భక్తులకు సుపరిచితం. ఈమె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా అయిన ఆకివీడు భీమవరం వాసి. ఈమె దాదాపుగా ఒక పుష్కర కాలంగా (12) సంవత్సరాలుగా అరుణాచలేశ్వరుడిని, భగవాన్ రమణ మహర్షిని, అరుణగిరిపై అచంచలమైన విశ్వాసంతో, అరుణాచలమనే శ్వాస, నిశ్వాలతో మమేకమై పోయారు. ఈమె  ఇప్పటికే మూడు సార్లు అరుణాచల గిరికి అంగ ప్రదక్షిణం పూర్తి చేసారు. ఇటీవల ఈమె నాల్గవ సారి అరుణాచల గిరి ప్రదక్షిణంలో ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా బారి నుంచి కాపాడమని అరుణాచలేశ్వరుడి కరుణ చూపమని కోరుకుంటు గిరి చూట్టూ అంగ ప్రదక్షిణం చేసింది.

 

అక్కడ తమిళ టీవీ ఛానల్ లో ఈమె గురించి చాల గొప్పగా ప్రశంసలు వస్తున్నాయి. ఈమె తెలుగు వ్యక్తి కావడం మనకు ఒక గర్వకారణం. ఈమె 12 సంవత్సరాలుగా ఒక బృహత్కార్యం చేస్తూన్నారు. అది ఎమిటంటే 63 మంది నాయనార్లు గురించి తెలుగులో  పుస్తకాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తమిళనాడులో ఉన్న దేవాలయం చరిత్ర కూడా తెలుగులోనికి తీసుకుని రావాలని దృడ సంకల్పంతో ఉన్నారు. ఇప్పటికే గత ఏడాది తిరువారూర్ క్షేత్రం (కమలాలయం)  మీద తెలుగులో ఈ పుస్తకం వచ్చింది. నేను ఆమె దగ్గర కు వెళ్ళి నప్పుడు ఒక పశ్న అడిగాను. అమ్మ "స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయడానికి అర్హత లేదు" అని మన పురాణాలు చెపుతున్నాయి కద! మరి మీరు మూడు సార్లు ఈ అరుణాచల గిరికి ఎలా అంగ ప్రదక్షణం చేసారు అని అడిగితే ఆత్మ తత్వముకు స్త్రీ, పురుషుల తేడ ఉండదు అని భగవాన్ రమణ మహర్షి చెప్పిన మాటలు గుర్తు చేసారు. ఈమెతో మాట్లాడుతుంటే అరుణాచలేశ్వరుడితో మనం మమేకమై పోతాము.

ఓం సుందరేశ్వరయనమః ఓం అరుణాచలేశ్వరయనమః

కరోనా బారి నుంచి కాపాడమని అరుణాచలేశ్వరుడి కరుణ చూపమని...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *