కొవిడ్ టీకా వేయించుకున్న ఆశా వర్కర్ మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన ఆశా వర్కర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురై కన్ను మూశారు. ఈనెల 19న విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకోగా రెండ్రోజులు బాగానే ఉందని, ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్లు ఆమె బంధువులు తెలిపారు. ఈనెల 21న తెల్లవారు జాము నుంచి తీవ్రమైన చలి, జ్వరం రావడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విజయలక్ష్మి చనిపోయారు. దీంతో విజయలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు జీజీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొవిడ్ టీకా వేయించుకున్న ఆశా వర్కర్ మృతి
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
