Top Ad unit 728 × 90

కారు పార్టీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా...?

కారు పార్టీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా...?

 

ఉద్యమ పార్టీగా ఉదయించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని తిరుగులేని రాజకీయ పార్టీగా ఎదిగింది టీఆర్ఎస్. గులాబీ బాస్ కేసీఆర్ అద్యక్షతన తిరుగులేని విజయంతో రెండోసారి తెలంగాణలో గులాబీ రెపరెపలాడింది. ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని నేడు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టించే స్థాయికి చేరిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆస్తుల విలువ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల కమిషనుకు అధికారికంగా టీఆర్ఎస్ చెప్పిన ఆస్తుల విలువ సుమారు 301.47 కోట్ల రూపాయలు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో ఆ పార్టీ తమ ఆస్తుల విలువను చెప్పింది. అయితే ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఇంకా ఎంత ఆస్థి ఉందన్నది కూడా హాట్ టాపిక్ అయ్యింది. తమ పార్టీ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన 2019-20 ఆడిట్‌ నివేదికను గత ఫిబ్రవరి 15న టీఆర్‌ఎస్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వార్షిక నివేదికను సీఈసీ ఇటీవల తన వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. 2018-19లో రూ.188.73 కోట్లుగా ఉన్న టీఆర్‌ఎస్‌ నిధులు, ఆస్తుల విలువ ఏడాది కాలంలో రూ.301.47 కోట్లకు చేరింది. ఏడాదిలోనే ఇంత ఆదాయం పెరగడంతో ఇతర రాజకీయ పార్టీలు ఆ షాక్ నుంచి తేరుకోకలేకపోతున్నాయి.

ప్రస్తుత ఆస్తిలో జనరల్‌ ఫండ్‌ రూపంలో 292.30 కోట్లు, కార్పస్‌ ఫండ్‌ రూపంలో రూ.4.76 కోట్లు, ఇతర రూపంలో రూ.4.41 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. పార్టీ పేరిట ఉన్న భవనాలు, వస్తు సామగ్రి విలువ రూ.21.27 కోట్లుగా ఉందని పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జిల్లా కార్యాలయాల స్థలం, భూముల విలువ సుమారు రూ.16.50 కోట్లుగా ఉంటుందని లెక్కలు వేసింది. 2019-20లో స్థిరాస్తుల కొనుగోలు, షెడ్యూలు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ తదితరాల రూపంలో రూ.101 కోట్లు సమకూరాయని కారు పార్టీ లెక్కలు చెప్పింది.

2019-20 ఆర్ధిక సంవత్సరంలో టీఆర్‌ఎస్‌కు వివిధ మార్గాల్లో 130.46 కోట్లు సమకూరితే, అందులో విరాళాల రూపంలో అత్యధికంగా 89.55 కోట్లు అందాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగు పార్టీ సభ్యత్వ నమోదు, పార్లమెంటరీ, లెజిస్లేటివ్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌వీ విభాగాల నుంచి కలుపుకుని 22.79 కోట్లు, బ్యాంకుల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, సేవింగ్‌ ఖాతాలపై వడ్డీ తదితరాల రూపంలో మరో రూ.18.10 కోట్లు సమకూరాయి. విరాళాల్లో ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.89.15 కోట్లు, వ్యక్తిగత దాతల నుంచి రూ.37.42 లక్షలు వచ్చాయని ఆ పార్టీ ప్రకటిచింది. ప్రకటనలకు 2.69 కోట్లు, ప్రచారానికి రూ.4.94 కోట్లు కలుపుకుని మొత్తంగా ఎన్నికల కోసం 7.64 కోట్లు ఖర్చు చేసినట్టు అఫిడవిట్ లో పేర్కొంది. వీటితోపాటు పార్టీ కార్యాలయాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఏడాది కాలంలో 21.18 కోట్లు పార్టీ అవసరాల కోసం ఖర్చు చేసినట్టు అందులో పేర్కొన్నారు.

 

కారు పార్టీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా...? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *