Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 22 జనవరి 2023 

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 22 జనవరి 2023  

 

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు- శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం.ఎన్. ఆచార్య

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు.  ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు  ఫలిస్తాయి. ధనవ్యవహారాలు కలసివస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. పితృ వర్గయుల నుండి ధన సహాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటాబయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ నభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో మందకోడిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం శ్రేయస్కరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. భూ, క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరులతో భూవివాదాలు తీర ఒప్పందాలు కుదురుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహరాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజి అవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు.  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. వివాదాలకు సంభందించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 22 జనవరి 2023  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *