Top Ad unit 728 × 90

వారఫలితాలు తేదీ 5 ఆగష్టు శుక్రవారం నుండి 11 గురువారం 2022 వరకు

వారఫలితాలు తేదీ 5 ఆగష్టు శుక్రవారం నుండి 11 గురువారం 2022 వరకు   

 

డా.యం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. డా. ఎం . ఎన్. ఆచార్య.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ వారం ఆర్థిక వ్యవహారాలు మీ అంచనాలకు తగినట్లుగా కొనసాగుతాయి. శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనూహ్యంగా ఆస్తులను సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ నిరూపించుకుని ముందుకు సాగుతారు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ వారం విద్యార్థులకు ఊహించని అవకాశాలు రావచ్చు. ఏ పని చేపట్టినా విజయమే. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను సమకూర్చుకుని మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతలైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. కళారంగం వారు తమ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వారం ప్రారంభంలో సోదరులతో కలహాలు. మానసిక ఆందోళన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. వాహనాలు, భూముల. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారి సలహాలు స్వీకరిస్తారు. వేడుకల నిర్వహణపై బంధువులతో సంప్రదిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభించి మరింత ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు  ఊహించని పిలుపు రావచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ వారం ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఆరోగ్యసమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. విద్యార్థులకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు అంచనాలకు తగినట్లు లేక నిరాశ చెందుతారు. ఉద్యోగవర్గాలకు మార్పులు అనివార్యం. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ వారం మీ సమర్థతను చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఉద్యోగయత్నాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. విద్యార్థులకు అనుకూల వాతావరణం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో పురోభివృద్ధి, అనూహ్యమైన లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. కళాకారులకు సన్మానయోగం. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ వారం ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తీరతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యసాధనలో సఫలమవుతారు. వ్యాపారవర్గాలకు తగినంతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ సేవలు విస్తృతమవుతాయి. సమర్థత చాటుకునే సమయం. పారిశ్రామికవర్గాల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం ధనరూపేణా సహాయపడతారు. వాహనయోగం. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రశంసలు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  వారం చివరిలో ఖర్చులు. కుటుంబసమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ వారం ఆర్థిక పరిస్థితి మందగించినా అవసరాలకు లోటు రాదు. ఇంటాబయటా ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి. వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలలో మీ కృషి ఫలించే సమయం. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ వారం ఏ పని చేపట్టినా పూర్తి చేసేవరకూ విశ్రమించరు. మీ ఆశయాల సాధనలో మిత్రులు సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థంగా నిర్వ స్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఒక కీలక కేసుపై కోర్టుల్లో అనుకూలత. వ్యాపారాలలో అంచనాల మేరకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సహచరుల సాయం అంది హుషారుగా గడుపుతారు. కళారంగం వారి కృషి ఫలించే సమయం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ వారం దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలలో చిక్కులు తొలగుతాయి. రుణయత్నాలు విరమిస్తారు. ఆస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం మధ్యలో మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ వారం కొత్త పనులు ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. కళాకారులకు కొన్ని పురస్కారాలు రావచ్చు. వారం చివరిలో అనుకోని ఆస్తి వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వారఫలితాలు తేదీ 5 ఆగష్టు శుక్రవారం నుండి 11 గురువారం 2022 వరకు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *