Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: 8 ఆగష్టు సోమవారం 2022

ఈ రోజు మీ రాశి ఫలాలు: 8 ఆగష్టు సోమవారం 2022

 

డా. యం. ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. డా. ఎం . ఎన్. ఆచార్య.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. వృథాఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన ధన వస్తులాభాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు అవసరానికి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు మీ రాశి ఫలాలు: 8 ఆగష్టు సోమవారం 2022 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *