Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: 12 ఆగష్టు శుక్రవారం 2022

ఈ రోజు మీ రాశి ఫలాలు: 12 ఆగష్టు శుక్రవారం 2022 

 

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. డా.  ఎం.ఎన్. ఆచార్య

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో అంచనాలు అందుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తిచేస్తారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. బంధు మిత్రులతో కలహా సూచనలున్నవి. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:  ఈ రోజు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూరపు బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకు కలిగిస్తుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ప్రారంభించి పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన కలుగుతుంది. ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు బంధు మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా సాగుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి,ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు అందక ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. బంధువుల ప్రవర్తన కొంతచికాకు కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారములలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాణించక ఇబ్బంది పడతారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: 12 ఆగష్టు శుక్రవారం 2022 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *