Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 20 సెప్టెంబర్ 2022

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 20 సెప్టెంబర్ 2022

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. డా. ఎం. ఎన్. ఆచార్య.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు ఆరోగ్య పరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆలయ దర్శనం చేసుకుంటారు. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు ఉద్యోగ వాతావరణం గందర గోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి.గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది వ్యాపారలకు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది మిత్రుల నుంచి శుభ వర్తమానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకుంలించవు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 20 సెప్టెంబర్ 2022 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *