Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 22 సెప్టెంబర్ 2022

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 22 సెప్టెంబర్ 2022

 

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. డా. ఎం. ఎన్. ఆచార్య.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి. సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:  ఈ రోజు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధన పరంగా చికాకులు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారమున ప్రత్యర్థులు కూడా  మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబసభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ విషయంలో  ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. దైవ చింతన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 22 సెప్టెంబర్ 2022 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *