Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - మీ PSLV TV నేటి మంచిమాట: సమాజంలో మార్పు  ఎందుకు రాదంటే...? పేదవారికి దైర్యం లేక, మధ్య తరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక....! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 15, 2020 శనివారం తిధి: ఏకాదశి ఉ 10:36 తదుపరి ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర రా తె 5:07 తదుపరి పునర్వసు యోగం: హర్షణం ఉ 7:53 కరణం: బాలవ ఉ 10:56 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5:59 సూర్యాస్తమయం: 6:43 రాహుకాలం: ఉ 9:00 - 10:30 యమగండం: మ 1:30 - 3.00 వర్జ్యం: మ 12:55 - 2:34 దుర్ముహూర్తం: ఉ 6:00 - 7:45 అమృతకాలం: రా 8:21 - 10:29 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

మునగ ఆకు వలన కలిగే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...!

మునగ ఆకు వలన కలిగే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...!

 

వివరణ: డా. యం.ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. మనకు తరచూ చూస్తేనే ఉన్నవాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని ఉపయోగించుకుంటే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో గమనిద్దాం. మునగాకు లోని ఔషధోపయోగాల గురించి ఈ క్రింద కొంత వివరణ ఇచ్చాను. దీనిలోని  ఔషధోపయోగాల గురించి తెలుసుకుందాం.

 

మునగకాయలు మరియు మునగ పువ్వుల ఉపయోగాలు తెలుసుకుందాం.

 

మునగ కాయలు, పచ్చి మామిడి కాయలు కలిపి వండిన కూర తినుచున్న వేసవిలో శరీరానికి చలవ చేకూరటయే గాక మన దేహము నందలి ఐరన్, విటమిన్ 'సి' లోపించకుండా ఉంటాయి.

 

మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గును.

 

ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధముగా పనిచేయును.

 

మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరి నీటిలో ఒక చెంచా మునగ పువ్వుల రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగును.

 

ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పై పై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటి నుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక ప్రసవం సౌఖ్యముగా అగును. దీనిలో ఉన్న క్యాల్షియం, ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడును. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారు స్త్రీ, పురుష బేధము లేకుండా టానిక్ లాగా వాడుకొనవచ్చు. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్దిగా పాలు ఉత్పత్తి అగును. ప్రసవానంతరం త్వరగా కోలుకుంటారు.

 

బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గును.

 

ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును.

 

పైన చెప్పిన మిశ్రమము నందు కొంచం నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే తలతిరుగుడు , మొలలు , ఎక్కిళ్లు , అజీర్ణం , తీసుకున్న ఆహారం శరీరానికి ఒంటబట్టకపోవడం వంటి సమస్యలు నివారణ అగును.

 

మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాయుచున్న చర్మవ్యాధులు అంతరించును.

 

మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు, బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును.

 

మునగాకు రసములో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అగును.

 

ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి అంతరించును.

మునగ ఆకు వలన కలిగే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *