Top Ad unit 728 × 90

పోలవరంపై ప్రధానికి సీఎం జగన్‌ లేఖ...!

పోలవరం పై ప్రధానికి సీఎం జగన్లేఖ...!

 

పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిన సవరణలను ఆమోదించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్ట్జీవ నాడి అని , ప్రాజెక్ట్పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్ట్అని అన్నారు. 2017-18 అంచనాల ప్రకారం పోలవరం వ్యయం రూ.55,656.87 కోట్లు ఉందని, నిధుల విడుదలలో జాప్యం, పనుల ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే నిర్మించాలని ఏప్రిల్‌ 29, 2014 నాటి కేబినెట్నిర్ణయం ప్రకారం ప్రాజెక్ట్ఖర్చు పెరిగితే కేంద్రమే భరించాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్పూర్తిఖర్చు కేంద్రమే భరిస్తుందని మే 8, 2017 కేంద్ర జలవనరుల శాఖ లేఖలో తెలిపింది. ప్రాజెక్ట్నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ అంచనాలు పెరిగిపోయాయి. డిజైన్లో మార్పులు, కొత్త చట్టం ప్రకారం పునరావాసం, భూ సేకరణ, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న నిరు పేదలకు పరిహారం వీటన్నింటి వల్ల ప్రాజెక్ట్అంచనా వ్యయాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్కోసం ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.12,520 కోట్లు ఖర్చు పెట్టింది. కేంద్రం రూ.8,507కోట్లు చెల్లించింది, ఇంకా రూ.4,013 కోట్లు చెల్లించాల్సి ఉంది.

 

అక్టోబర్‌ 12, 2020 కేంద్ర ఆర్థిక శాఖ కొత్త మెలిక పెట్టింది. చెల్లించాల్సిన బకాయిల్లోంచి రూ.2,234 కోట్లు ఇస్తామంటూనే సాగునీటి కాంపోనెంట్ను తొలగించాలని లేఖ రాసింది. ఇది విభజన చట్టంలో అంగీకరించిన దానికి పూర్తి విరుద్ధం. ఇప్పటికే రూ.17,656 కోట్ల ప్రజాధనం ప్రాజెక్టు కోసం వెచ్చించాం. సమయంలో కొత్త షరతులు తెస్తే ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోతుంది. భూసేకరణ, పునరావాసానికే భారీగా ఖర్చు కానుంది. ఇప్పుడు నిధుల జాప్యం చేస్తే అంచనా వ్యయం పెరుగుతుంది. 2013-14 ప్రకారం కేవలం రూ.20,398 కోట్లు ఇస్తామంటున్నారు. కానీ పునరావాసం, భూసేకరణకే రూ.28,191 కోట్లు అవుతుంది. లెక్కన పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది?. ప్రధానిగా మీరు తక్షణం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చూడండి. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖను ఆదేశించండి. 2021 డిసెంబర్కల్లా పోలవరం ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేయండిఅని విజ్ఞప్తి చేశారు.

 

పోలవరంపై ప్రధానికి సీఎం జగన్‌ లేఖ...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *