Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్...!

ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్...!

 

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరోనా కారణంగా కోత విధించిన వేతనాలకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేరకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్ బకాయిలు చెల్లింపుల విధానాన్ని ప్రకటించింది. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్లో రెండు విడతలుగా చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో నాలుగు విడతలుగా చెల్లింపులు జరిపేందుకు నిర్ణయించింది. మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సంక్షోభం కారణంగా మార్చి, ఏప్రిల్, మే, నెలలకు సంబంధించి ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో తెలంగాణ ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో జూన్కు సంబంధించి ఉద్యోగులకు పూర్తి వేతనం, పెన్షనర్లకు పూర్తి పింఛన్ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. లాక్డౌన్ సడలింపుల తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడటం, జీతాలు, పింఛన్ల కోతపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ మేరకు నిర్ణయం తీసుకున్నారు.అయితే కరోనా కారణంగా వేతనాలు, పెన్షన్లలో విధించిన కోతకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం ఎఫ్పుడు చెల్లిస్తుందనే దానిపై ఉద్యోగులు, పెన్షనర్లు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. అయితే కరోనా కారణంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాత దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు కోత విధించిన వేతనాలు,బకాయిలను దశలవారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *