Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - మీ PSLV TV నేటి మంచిమాట: సమాజంలో మార్పు  ఎందుకు రాదంటే...? పేదవారికి దైర్యం లేక, మధ్య తరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక....! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 15, 2020 శనివారం తిధి: ఏకాదశి ఉ 10:36 తదుపరి ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర రా తె 5:07 తదుపరి పునర్వసు యోగం: హర్షణం ఉ 7:53 కరణం: బాలవ ఉ 10:56 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5:59 సూర్యాస్తమయం: 6:43 రాహుకాలం: ఉ 9:00 - 10:30 యమగండం: మ 1:30 - 3.00 వర్జ్యం: మ 12:55 - 2:34 దుర్ముహూర్తం: ఉ 6:00 - 7:45 అమృతకాలం: రా 8:21 - 10:29 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి: సిపిఎం డిమాండ్

జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి: సిపిఎం డిమాండ్

 

చింతలపూడి ఎత్తిపోతల పథకం భూనిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి. ఎత్తిపోతలు వెంటనే పూర్తిచేసి మెట్టప్రాంత భూములకు సాగునీరు అందించాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూనిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని సిపిఎం అప్ ల్యాండ్ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు డిమాండ్ చేశారు. ఎత్తిపోతలు పనులు వెంటనే పూర్తిచేయాలని కోరారు. స్థానిక పవరుపేటలోని ఉద్దరాజు రామం భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చింతలపూడి ఎత్తిపోతల భూనిర్వాసిత రైతులకున్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయినా చింతలపూడి ఎత్తిపోతల పథకం భూనిర్వాసిత రైతుల సమస్య పరిష్కారం కోసం తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు.

 

బాధిత రైతులు మాత్రం మంత్రులు, ఎం.ఎల్.ఎలు, ఎం.పిలు, అధికార్ల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ పూర్తి కాకుండానే ఆ భూములను బ్లాక్ లిస్టులో పెట్టడం దారుణమన్నారు. ఆన్లైన్ ఆ భూములు కన్పించకపోవడం వలన ఆ రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదన్నారు. పంటల సాగుకోసం ప్రైవేటు అప్పులు చేయాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాలకు భూములు అమ్ముకుందామంటే బ్లాక్ లిస్టులో పెట్టిన కారణంగా రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి అని వివరించారు. కాలువ పనులు ఎప్పుడు మొదలు పెడతారో తెలియక పంటలు వేయాలో, మానుకోవాలో అర్థంకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

 

గత ప్రభుత్వం భూనిర్వాసిత రైతుల పట్ల వివక్షత చూపిందని ఈ ప్రభుత్వమైనా ఆదుకుంటుందని రైతులు ఎంతో ఆశతో ఉన్నారని కానీ ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు రూ.30లక్షలకు పైగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల్లో 2 లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు, 191 గ్రామాలకు త్రాగునీరు ఈ ఎత్తిపోతల పథకం లక్ష్యమన్నారు. ఈ పథకం ఫేజ్-1 పనులు తక్షణం పూర్తిచేసి జిల్లా మెట్ట ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరు అందించాలని కోరారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు జరగడం లేదన్నారు.

 

ఈ పథకం పూర్తి చేయాలనే చిత్తశుద్ధి కన్పించడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం భూ నిర్వాసిత రైతులకున్యాయమైన పరిహారం, మెట్ట ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించాలని కోరారు. పనులు వేగవంతం చేయాలని, అందుకు తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను, ప్రజలను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్, ఆర్.వి.ఎస్. నారాయణ పాల్గొన్నారు.

 

సేకరణ: రవి పామర్తి, ఏలూరు.

జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి: సిపిఎం డిమాండ్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *