Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం:సెప్టెంబరు 30, 2020  బుధవారం | తిధి: చతుర్దశి  రా 10:53 తదుపరి పౌర్ణమి | నక్షత్రం: పూర్వాభాద్ర రా 2:53 తదుపరి ఉత్తరాభాద్ర | యోగం: గండం రా 8:45 | కరణం: గరజ ఉ 11:26 | సూర్యరాశి: సింహం | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6.06 | సూర్యాస్తమయం: 6:06 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: ఉ 8:03 - 9:45 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: సా 5:26 - 8:12 | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: చక్కగా జీవించి బ్రతికే వారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండే వారికి బాధలు ఎక్కువ నమ్మినవారికే మోసాలుఎక్కువ | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

మౌత్‌వాష్‌తో కరోనా వ్యాప్తికి చెక్‌?...!

మౌత్వాష్తో కరోనా వ్యాప్తికి చెక్‌?...!

 

బెర్లిన్‌: గొంతులో గరగరగా అనిపించినా ఇబ్బందిగా ఉన్నా వేడినీటిలో కాస్తా పసుపు వేసుకుని పుక్కిలిస్తారు మనలో చాలమంది. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి జనాలు తిరిగి పెరటి వైద్యం వైపు మళ్లారు. గోరు వెచ్చని నీటిలో ఉప్పు, పసుపు వేసి పుక్కిలించడం.. జీలకర్ర, అల్లం, సొంఠి, మిరియాలు వంటి మసలా దినుసులతో చేసిన కషయాలు తాగడం ప్రస్తుతం చాలామంది దినచర్యలో భాగమయ్యింది. నేపథ్యంలో మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్కణజాలం తగ్గుతుందని ఫలితంగా వైరస్ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కేవలం వైరస్వ్యాప్తిని మాత్రమే అరికట్టగలమని.. తగ్గించడం సాధ్యం కాదంటున్నారు. మేరకు నివేదిక విడుదల చేశారు.లిక్విడ్బదులు జెల్శానిటైజర్లు విక్రయించాలి

కరోనా రోగుల్లో గొంతు, కావిటీలోలఎక్కువ మొత్తంలో వైరల్లోడు కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం వైరస్బారిన పడిన వారు ఇతరులతో మాట్లాడటం, దగ్గడం, చీదడం వంటివి చేసినప్పుడు వైరస్డ్రాప్లెట్స్అవతలి వారి మీద పడటంతో వారు కోవిడ్బారిన పడుతున్న సంగతి తెలిసిందే. క్రమంలో మౌత్వాష్తో నోటిని పుక్కిలించడం వల్ల నోట్లోని వైరస్కణాల సంఖ్య తగ్గి  వ్యాప్తి తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. పరిశోధన కోసం వారు జర్మనీలోని ఫార్మసీలలో లభించే 8 రకాల మౌత్వాష్లను పరీక్షించారు. ఇవన్ని వేరు వేరు పదార్థాలతో తయారు చేయబడ్డాయి. పుక్కిలించడం వల్ల లాలాజల వైరల్ లోడ్ తగ్గి.. తద్వారా కరోనా వైరస్ప్రసారం తగ్గుతుందన్నారు.

స్టడీలో భాగంగా పరిశోధకులు మౌత్వాష్లను వైరస్కణాలతో కలిపి నోటిలోని లాలాజలాన్ని పోలిన ద్రవాన్ని సృష్టించారు. 30 సెకన్ల పాటు పుక్కిలించిన తర్వాత వెరో 6 కణాలను పరీక్షించగా వైరస్కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వెరో 6 కణాలు వైరస్ను ఆకర్షిస్తాయని తెలిపారు. పరిశోధనలో చాలా మౌత్వాష్లు సమర్థవంతంగా పని చేశాయని.. ప్రత్యేకంగా మూడు రకాలు వైరస్ను పూర్తిగా తొలగించినట్లు కనుగొన్నామన్నారు. పుక్కిలించిన తర్వాత ఎంత సమయం వరకు ప్రభావం ఉంటుందనే అంశం గురించి ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడే ముందు మౌత్వాష్తో నోరు పుక్కిలించడం వల్ల వైరస్వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చు అంటున్నారు

 

మౌత్‌వాష్‌తో కరోనా వ్యాప్తికి చెక్‌?...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *