Top Ad unit 728 × 90

చైనా మరో పన్నాగం బయటపడింది…!

చైనా మరో పన్నాగం బయటపడింది…!

 

ఇండియా చైనా దేశాల మధ్య బోర్డర్ సమస్య రెండు దేశాలను ఇబ్బందులు పెడుతున్నది. లడక్ ప్రాంతంలో చైనీస్ ఆర్మీ ఇండియా బోర్డర్ వైపు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో ఇండియాకూడా బలమైన సమాధానం చెప్తున్నది. బోర్డర్ లో సైనికుల సంఖ్యను పెంచింది. లడక్ లోని సమస్యాత్మక ప్రాంతాలకు రోడ్లను, బ్రిడ్జీలను వేగంగా నిర్మిస్తున్నది.

 

ఇక ఇదిలా ఉంటెచైనా, పాక్ మధ్య రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మార్గంతో పాటుగా పాక్ లోని గ్వాదార్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నది. పాక్, ఇరాన్ సరిహద్దుల్లో ఈ పోర్ట్ ఉన్నది. ఈ పోర్ట్ ను డెవలప్ చేసి దానిని చైనా తన నావెల్ బేస్ గా వాడుకోవాలని చూస్తున్నది. ఇండియా శాటిలైట్ ద్వారా ఈ విషయాన్ని పసిగట్టింది. చైనా నుంచి నావెల్ పోర్ట్ డెవలప్మెంట్ కు సంబంధించిన పరికరాలను పాక్ కు సరఫరా చేస్తున్నట్టు ఇండియా అధికారులు గుర్తించారు. దీంతో ఇండియన్ ఆర్మీ అధికారులు బోర్డర్ లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 46 బిలియన్ డాలర్ల ఖర్చుతో చైనా పాక్ మధ్య ఎకనామిక్ కారిడార్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 

చైనా మరో పన్నాగం బయటపడింది…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *