Top Ad unit 728 × 90

మీ ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే...!

మీ ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే...!

 

కరోనా వైరస్ మనకు సోకకుండా ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలుసు. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపించినా, లేక ఎవరైనా ఇంట్లోనే క్వారంటైన్ అయిన వారికి వైరస్ లక్షణాలు ఉంటే, అది ఇతర కుటుంబ సభ్యులకు సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రిపెన్షన్ (CDC) కొన్ని సూచనలు చేసింది. ఇంట్లో కరోనా అనుమానితులు ఉంటే, వాటిని తప్పక పాటించాలని సూచించింది. అవేంటో తెలుసుకుందాం.

ప్రశ్న: నాకే కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే…?

జవాబు: బాడీలో టెంపరేచర్‌ను ధెర్మోమీటర్‌తో రోజుకు రెండుసార్లు చెక్ చేసుకోవాలి. 100.4 డిగ్రీల ఫారన్ హీట్ (38 డిగ్రీల సెల్సియస్) ఉంటే డాక్టర్‌కి కాల్ చెయ్యాలి. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే డాక్టర్‌ వచ్చాక ముఖానికి మాస్క్ పెట్టుకొని మాత్రమే డాక్టర్‌ని కలవాలి.

ప్రశ్న: ఇంట్లో క్వారంటైన్‌గా ఎంతకాలం ఉండొచ్చు…?

జవాబు: కరోనా వైరస్ అనుమానితులు ఇళ్లలోనే క్వారంటైన్ చేసుకోవాలి. ఒకవేళ రెండ్రోజులకు ఓసారి చేసే టెస్టుల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ ఇళ్లలోంచీ బయటకు రాకూడదు. ఎందుకంటే వాళ్లకు మరోసారి వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి.

ప్రశ్న: నాకు కరోనా ఉంది అనిపిస్తే, నేను బయటకు వెళ్లొచ్చా…?

జవాబు: వెళ్లకూడదు. టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేస్తే, అంబులెన్స్‌లో డాక్టర్లే ఇంటికి వస్తారు. దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్తారు.

 

ప్రశ్న: నేను ఇంట్లో క్వారంటైన్ ఉంటే, నా వల్ల కుటుంబ సభ్యులకు వైరస్ సోకుతుందేమో?

జవాబు: ఇలా జరగకుండా చూసుకోవాలి. ప్రత్యేక గదిలో ఉండాలి. ఇంట్లో ఎవరికీ 2 మీటర్ల కంటే దగ్గరకు రాకూడదు. ఇంట్లో పెంపుడు జంతువుల్ని పట్టుకోకూడదు.

ప్రశ్న: కుటుంబ సభ్యులు చేసే బాత్రూంలో నేనూ స్నానం చెయ్యొచ్చా…?

జవాబు: చెయ్యకూడదు. ప్రత్యేక బాత్రూంలోనే చెయ్యాలి. అలాంటి సదుపాయం లేకపోతే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లడం మేలు. అది కూడా కాల్ చేస్తే వాళ్లే వచ్చి తీసుకెళ్తారు.

ప్రశ్న: అత్యంత పరిశుభ్రత అంటే ఏంటి…?

జవాబు: కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఇంట్లోనే ఐసోలేషన్‌గా విడిగా ఉంటే ఆ వ్యక్తి వాడే బట్టలు, వస్తువుల్ని ప్రతి రోజూ శుభ్రంగా సబ్బు, డిజర్జంట్లతో కడగాలి. అలాగే ఆ వ్యక్తి పడుకునే మంచం, దుప్పటి, దిండు అన్నీ రోజూ సర్ఫు లేదా సోపుతో కడగాలి. అలాగే ఆ వ్యక్తి భోజనం తినే ప్లేట్లను కూడా బాగా క్లీన్ చెయ్యాలి. (ఇలా క్లీన్ చేసేవారు ఆ సమయంలో తమ ముక్కు, నోరు, కళ్లు, చెవులను తమ చేతులతో ముట్టుకోకూడదు. ముఖానికి మాస్క్ ధరించాలి. అలాగే క్లీనింగ్ తరవాత సబ్బుతో తలస్నానం చేయాలి.)

ప్రశ్న: ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి…?

జవాబు: కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఉండే గదిని రోజూ సబ్బు నీటితో శుభ్రం చెయ్యాలి. ఆ గదిలోని ప్రతీ వస్తువునూ రోజూ శుభ్రం చెయ్యాలి. కరోనా లక్షణాలు ఉండే వ్యక్తికి ఏది ఇచ్చినా మన చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకుని, ముఖానికి మాస్క్ తొడుక్కొని మాత్రమే ఇవ్వాలి. ఆ గది తలుపులు మూసివేసి ఉంచాలి. పిల్లలు అటు వెళ్లకుండా చెయ్యాలి.

ప్రశ్న: ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి…?

జవాబు: కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి (అనుమానితులు) ప్రతీ రెండు గంటలకు ఓసారి తమ చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. ఆ తర్వాత చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకోవాలి. కరోనా అనుమానిత వ్యక్తి ఉన్న రూం ఎప్పుడూ పొడిగా ఉండాలి. నీటి చమ్మ లేకుండా చూసుకోవాలి. ఫ్యాన్ వాడొచ్చు. ఏసీ వాడకూడదు.

ప్రశ్న: నాకు కరోనా సోకిన అనుమానం ఉంటే నా ముఖాన్ని ముట్టుకోవచ్చా…?

జవాబు: ముట్టుకోకూడదు. ఎంత దురద వస్తున్నా భరించాలే తప్ప చేతులతో ముఖాన్ని ముట్టుకోకూడదు. మరీ తప్పని సరైతేనే ముట్టుకోవాలి.

ప్రశ్న: అనుమానిత వ్యక్తి వాడిన కంచాలు, గిన్నెల వంటి వస్తువులు వేరే వాళ్లు వాడొచ్చా…?

జవాబు: వీలైనంతవరకూ వాడకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వస్తువుల్ని రెండు మూడుసార్లు బాగా డిటర్జంట్ లేదా యుటెన్శిల్స్ సర్ఫుతో కడిగిన, ఆరబెట్టిన తర్వాత మాత్రమే వాడాలి.

ప్రశ్న: క్వారంటైన్‌లో ఉన్నప్పుడు తుమ్ము, దగ్గు వస్తే…?

జవాబు: తుమ్ము, దగ్గును ఎప్పుడూ బలవంతంగా ఆపకూడదు. ఐతే మాస్క్ తీసివేసి మోచేతిని అడ్డుగా పెట్టుకొని అప్పుడు తుమ్మాలి లేదా దగ్గాలి. ఆ తరవాత మాస్క్ ధరించి, వెంటనే చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. మళ్లీ వెంటనే హ్యాండ్ శానిటైజర్ రాసుకోవాలి. ఇలా ప్రతిసారీ చేస్తూనే ఉండాలి.

ఇలా అనుమానిత వ్యక్తి వాడే ప్రతీ వస్తువునూ ప్రతి రోజూ శుభ్రంగా సబ్బు, సర్ఫు, డిటర్జంట్లతో కడగాల్సిందే. నాణ్యత లేని మాస్కులను మళ్లీ మళ్లీ వాడకూడదు. అనుమానిత వ్యక్తికి సంబంధిచిన మాస్కులు, ఇతర వస్తువుల్ని పారేసేటప్పుడు వాటిని కవర్లలో పూర్తిగా మూసివేసి డస్ట్‌బిన్‌లో మాత్రమే వెయ్యాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే కుటుంబంలో ఇతరులకు కరోనా వైరస్ సోకకుండా ఉంటుందని CDC తెలిపింది.

మీ ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *