Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: 5 ఆగష్టు శుక్రవారం 2022 

ఈ రోజు మీ రాశి ఫలాలు: 5 ఆగష్టు శుక్రవారం 2022 

 

డా. యం. ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక - హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు పాత  మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.  సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు విద్యార్థుల ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన  ఫలితం   లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఉద్యోగమున  అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.  ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలహా సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:  ఈ రోజు వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.గృహమున వివాహ శుభకార్యాలు  నిర్వహిస్తారు. చేపట్టిన  వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు  ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులు శ్రమతో కాని పూర్తికావు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ముఖ్యమైన  వ్యవహారాలలో నమ్మినవారే మోసగిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది  స్ధిరాస్తి  కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.   వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి  (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి  బంధు మిత్రులతో మాటపట్టింపులు  కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పు. ముఖ్యమైన  పనులు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట వివాదాలు కలుగుతాయి  చేపట్టిన పనులు   శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. నిరుద్యోగ  ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: 5 ఆగష్టు శుక్రవారం 2022  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *