Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: 13 ఆగష్టు శనివారం 2022.

ఈ రోజు మీ రాశి ఫలాలు: 13 ఆగష్టు శనివారం 2022.

 

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు. శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు సమాజంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. ఆలయ సందర్శన చేసుకొంటారు. సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. సంఘంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమయానికి తగిన ధనసహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వ్యవహారాల ఆలోచనలో స్థిరత్వం ఉండదు. గృహమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పై వారి నుండి మాట పడవలసి వస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బంది పడతారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు సమయానికి నిద్రహారాలు ఉండవు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు సంతాన విషయాలు సంతృప్తినిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: 13 ఆగష్టు శనివారం 2022. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *