Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 23 నవంబర్ 2022 

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 23 నవంబర్ 2022 

 

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు- శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం.ఎన్. ఆచార్య

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. నూతన వాహనయోగం ఉన్నది, కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.   ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.   నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు నూతన రుణయత్నాలు అనుకూలించవు.ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.  దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.   చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేజారుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 23 నవంబర్ 2022  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *