Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 24 నవంబర్ 2022 

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 24 నవంబర్ 2022 

 

డా. యం.ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు- శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక:  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం.ఎన్. ఆచార్య

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:  ఈ రోజు  వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:  ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలాకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు  వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 24 నవంబర్ 2022  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *