Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: 6 ఆగష్టు శనివారం 2022

ఈ రోజు మీ రాశి ఫలాలు: 6 ఆగష్టు శనివారం 2022

 

డా. యం. ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

గమనిక: ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. డా. ఎం . ఎన్. ఆచార్య.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో దైవ చింతన పెరుగుతుంది వ్యాపారాలు అంతగా కలిసిరావు. దీర్ఘ కాలిక ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు తప్పదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు ఉద్యోమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. బంధువులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఉద్యోగ విషయమై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు ఆకస్మిక ధన లాభాలుంటాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. స్ధిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది. తగినంత ఆదాయం లభించదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: 6 ఆగష్టు శనివారం 2022 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *