Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

కరోనా నిబంధనలతో ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి మహోత్సవాలు...!

కరోనా నిబంధనలతో ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి మహోత్సవాలు...!

 

నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నెల 25 తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ స్వర్ణకవచాలంక్రుత శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది. అయితే..ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనార్ధం భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. కోవిడ్ద్రుష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి ఇవ్వనున్నారు. స్లాట్ లేని, మాస్క్ ధరించని భక్తులకు అనుమతి నిరాకరించారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యక్ష పూజలకు అనుమతి నిరాకరణ పరోక్షంగా జరిగే పూజలను వీడియోస్ ద్వారా వీక్షించే అవకాశం ఇచ్చారు. ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విఐపి లకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. పది సంవత్సరాల లోపు పిల్లలకు 60 ఏళ్ల పైబడిన వారికి దర్శనానికి అనుమతి నిరాకరించారు. దుర్గగుడి ఉద్యోగులకు ప్రతి మూడురోజులకొకసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

కరోనా నిబంధనలతో ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి మహోత్సవాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *