ఆ ఆలయంలో శివయ్య కళ్ళు తెరిచాడట...!
ఆ ఆలయంలో శివయ్య కళ్ళు తెరిచాడట...!
కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని, చిక్కోడి నియోజకవర్గంలోని గోకాకలో శివుడు కళ్లు తెరిచాడు…! అవును దేవాలయంలో ఉన్న శివలింగం కళ్లు తెరిచింది. ఇది చాలా శుభపరిణామం అనీ, ఇక అంతా మంచే జరుగుతుందని అంటున్నారు ఆలయ పూజారి. శివలింగం కళ్లు తెరవటం ఇది మొదటిసారికాదని గతంలో కూడా శివలింగానికి ఉన్న కళ్లు తెరుచుకున్నాయని ఇదంతా మంచికేనని అంటున్నారు ఆలయ పూజారి.
బెల్గాం జిల్లాలోని గోకాకలో పరమేశ్వరుడి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న శివలింగం కళ్లు తెరిచింది. ఈ విషయం తెలిసిన భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో ఆలయం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
కాగా, ప్రతీరోజు లాగానే పూజారి ఉదయాన్నే శివయ్య స్వామికి పూజా కార్యక్రమాన్ని యధావిధిగా జరిపించి, అన్నీ ముగించుకొని బయటకు వెళ్లారు. ఈక్రమంలో స్థానికంగా ఉండే రాజేశ్వరి భూతీ అనే మహిళా భక్తురాలు స్వామివారిని దర్శించుకోటానికి వచ్చారు. దర్శనం కోసం ఆలయానికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకుంటూ కళ్లారా శివయ్యను చూస్తు ఉంది.
అలా చూస్తున్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. షాక్ అయ్యింది. శివలింగానికి ఉన్న కళ్లు తెరుచుకుని అచ్చం మనిషిలా చూస్తున్నట్లుగా అనిపించింది. దీంతో ఆమె శరీరం ఒక్కసారిగా జలదరించింది. నాది భ్రమా అనుకుంటూ కళ్లు నులుముకుని మళ్లీ పరిశీలనగా చూసింది. శివలింగానికి 2 కళ్లు తెరిచి ఉన్నట్లు ఆమెకు కనిపించింది. ఆమె నమ్మలేకపోయింది. మరికాస్త జాగ్రత్తగా చూడగా, నిజంగానే 2 కళ్లు తెరచి తననే చూస్తున్నట్లు కనిపించింది. అది నిజమేనని తెలుసుకున్న ఆమె షాకైంది. సంభ్రమాశ్చర్యాలకు గురైంది.
అంతే శివయ్యా… శివయ్యా… కరుణించావా తండ్రీ అనుకుంటూ తెగ ఆనంద పడిపోయింది. నా జన్మ ధన్యమైపోయిందిస్వామి అంటూ తెగ ఆనంద పడిపోయింది. స్వామికి మొక్కుకొని, ఆ ఆనందంలో పరుగులు పెట్టుకుంటూ ఊళ్లోకి వెళ్లి చెప్పింది. అంతే, ఎక్కడి వాళ్లు అక్కడే చేస్తున్న పనులన్నీ ఆపేసి, ఆలయానికి పరుగులు పెట్టుకుంటూ వచ్చేశారు. ఈ వార్త గంటలో ఆ ఊరి నుంచి గోకాక నగరం మొత్తం వ్యాపించింది. అదికాస్తా ఆనోటా ఈనోటా చుట్టుపక్కల గ్రామాలకూ పాకింది. అంతే, ఇక ఆలయానికి క్యూ కట్టారు. ఎప్పుడూ లేనంత మంది భక్తులు భారీగా తరలివచ్చారు.
దీంతో ఆలయం ముందంతా ఎక్కడ చూసినా జనమే. చుట్టుపక్కల అంతా వాహనాల పార్కింగ్. ఎటుచూసినా భారీ రద్దీ. అందరిలోనూ ఒకటే టెన్షన్. శివయ్యకళ్లు తెరిసిన సుందర అరుదైన దృశ్యాన్ని తాము చూడగలమో లేదో, తమకు ఆ భాగ్యం దక్కుతుందో లేదోనని ఎవరికి వారు కళ్లు తెరిచిన శివలింగాన్ని చూడటానికి పోటీ పడ్డారు. తాము ఆలయంలోకి వెళ్లేసరికి శివయ్య కళ్లు తెరిచే ఉంటాయో, మూసుకుపోతాయో అని ఒకటే టెన్షన్.
విషయం తెలిసిన పూజారి మాత్రం ఏమాత్రం కంగారు పడకుండా తాపీగా ఆలయానికి వచ్చారు. ఎందుకంత కంగారుపడుతున్నారు. ఈ దేవాలయంలో శివలింగానికి ఇలా కళ్లు తెరచుకోవడం ఇది రెండోసారి. 2004లో తొలిసారి ఇలా జరిగిందనీ, అలా జరిగిన తరువాత ప్రపంచానికి మేలు జరిగిందనీ, మళ్లీ ఇప్పుడు అదే విధంగా జరిగింది కాబట్టి, మంచే జరుగుతుందని తెలిపారు. కాగా, ప్రస్తుతం శివలింగం కళ్లు మళ్లీ మూసుకుపోయినట్లు తెలిసింది.
#breaking news telugu #latest news telugu, #pslv tv news
