మార్కెట్ లోకి టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ట్రిమ్. ధర ఎంతంటే...!
టాటా మోటార్స్ తన పెట్రోల్ వేరియంట్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ ‘‘ఆల్ట్రోజ్ ట్రిమ్’’ కారును ఇలీవల ఆవిష్కరించింది. ఇందులో 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు. ఇది 108 బీహెచ్పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ సాయంతో కారు కేవలం 12 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 90 పీఎస్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఈ కొత్త ఆల్ట్రోజ్ ట్రిమ్ ధరను కంపెనీ జనవరి 22న ప్రకటించనుంది. అదేరోజున అమ్మకాలు ప్రారంభమవుతాయి.
డిజిల్ వేరియంట్లోని ఆల్ట్రోజ్ మోడల్ కార్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 45 వేల యూనిట్లను విక్రయించామని, ఇప్పటికీ డిమాండ్ బలంగా ఉందని కంపెనీ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ తెలిపారు. తాజాగా ఆవిష్కరించిన ఈ పెట్రోల్ వేరియంట్ ఆల్ట్రోజ్ ట్రిమ్ కు ఇదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని శ్రీవాస్తవ ఆశించారు.
