Top Ad unit 728 × 90

ఈ రోజు రాశిఫలాలు 01 జూన్ 2021

ఈ రోజు రాశిఫలాలు 01 జూన్ 2021

 

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు యాక్టీవ్ గా వుంటూ కార్యకలాపాలు నిర్వహించి విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా విశేషమైన ప్రగతిని పొందుతారు. ఇంట్లో చిన్న చిన్న ఆందోళనలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుస్తారు.

 

వృషభరాశి: ఈ రాశి ఈ రోజు మీ మనో థైర్యంతో, ఆత్మబలంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో అవకాశాలు సన్నగిల్లి నిరుత్సాహం కలుగుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి, కుటుంబంతో కొంత సమయాన్ని గడపండి. పనిలో మీ సామర్థ్యం పెరుగుతుంది. నూతన అవకాశాలు కూడా సిద్ధిస్తాయి.

 

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు సమయం, వ్యూహం, ప్రవర్తనతో ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. హార్డ్ వర్క్ చేయడం ద్వారా సమస్యలు ముగుస్తాయి. అత్యుత్సాహం కారణంగా కొన్ని పనులు చెడిపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. సంతానం వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు.

 

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రాశివారికి పిల్లల వివాహానికి సంబంధించి చర్చలు ఉండవచ్చు. వ్యాపార, వాణిజ్యాల్లో కొన్ని అనుభవాలు మిగులుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. వైవాహిక జీవితంలో పూర్తి సహకారం, నమ్మకం లభిస్తాయి.

 

సింహ రాశి: ఈ రాశి వారు కుటుంబ ఖర్చులను నియంత్రించాల్సిన అవసరముంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. స్నేహితుడు లేదా బంధువులతో సంబంధాలు పునరుద్ధరించుకుంటారు. విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమం చేసుకుంటారు. సోదరులు, స్నేహితులు సహాయం చేయడానికి అవకాశముంటుంది. జీవిత భాగస్వామి సలహా సహాయపడుతుంది.

 

కన్యా రాశి: ఈ రాశి వారికి పెద్దవారికి సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీరు ప్రత్యర్థులను మించిపోతారు. ఇల్లు, కార్యాలయంలో అన్ని సమస్యలను సంయమనంతో విజయవంతంగా ఎదుర్కొంటారు. వ్యాపారంలో పెద్దగా లాభాలు ఉండవు. రోజువారీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

 

తులా రాశి: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో కష్టపడి విజయం సాధిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి కనబరుస్తారు. తద్వారా మీ లోపల దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు మీ రహస్య శత్రువులను మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబంలో అశాంతి వాతావరణం ఉండవచ్చు.

 

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకోసం పెద్దలతో సమావేశమవుతారు. మీ శౌర్య, కృషి కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటారు. స్నేహితుల సహకారం అలాగే ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు ఒత్తిడితో కూడుకొని ఉంటాయి. కాబట్టి మీరు వ్యాపారంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది.

 

ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు సహచరలు మీ పని ద్వారా ప్రభావితులవుతారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో డబ్బు ఉంటుంది. శత్రువులు విజయం సాధిస్తారు. రాత్రి ఏదైనా వివాహ వేడుకకు హాజరవుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

 

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న అమ్మకాలు అకస్మాత్తుగా పుంజుకుంటాయి. వైవాహిక సంబంధాలపై పూర్తి సహకారం, నమ్మకం అనుభవిస్తారు. ఉన్నతాధికారుల సాయంతో ఆస్తి సంబంధిత వివాదం కూడా పరిష్కరించుకుంటారు.

 

కుంభ రాశి: ఈ రోజు ఈ వ్యాపారంలో ఆకస్మిక లాభాలు అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదంతో వృద్ధి సాధించడానికి ప్రత్యేక అవకాశాలు పొందుతారు. సోదరులు, సోదరీమణులతో విభేదాలు ఉండవచ్చు. కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లే ముందు పూర్తి భద్రతా ఏర్పాట్లు తనిఖీ చేయండి.

 

మీన రాశి: ఈ రాశి వారు పట్టుదలతో వృత్తి, వ్యాపారాల్లో తోటివారి సహాయంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. నేడు నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ప్రత్యర్థులు మీ చేతుల్లో పరాజీతులవుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.

 

ఈ రోజు రాశిఫలాలు 01 జూన్ 2021 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *