Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు ఆదివారం 28 జూన్ 2020

ఈ రోజు మీ రాశి ఫలాలు ఆదివారం 28 జూన్ 2020

 

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

మేషం: ఈ రోజు మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ ప్రతిభకు పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. వీలైనంతవరకు వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభం: ఈ రోజు కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధువుల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు, లాభాలు పొందుతారు. విందు, వినోదాలు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

మిధునం: ఈ రోజు సంఘంలో గౌరవంతో పాటు ఆదరణ పొందుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు చేస్తారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకం: ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అవసరానికి తగిన సహాయం చేసే వారున్నారు. కొన్ని విషయాల్లో ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. శ్రమకు తగిన ఫలితం ఉండదు. కీలక నిర్ణయాల్లో తొందపాటు పనికిరాదు. పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహం: ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి సహాయసాకారాలు అందుతాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్య: ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు. సోదరులను కలుస్తారు. అనవసర విషయాల్లో కాలం వృథా కాకుండా చూసుకోవాలి. నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడపుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

తుల: ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు సాగిస్తారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆస్తి తగాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

వృశ్చికం: ఈ రోజు అవసరానికి తగిన సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంఘంలో గౌరవంతో పాటు ఆదరణ కూడా పొందుతారు. ధన, వస్తు లాభాలు అందుకుంటారు. భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

 

ధనస్సు: ఈ రోజు స్వల్ప ధనలాభం ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ ముందుకు సాగాలి. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్పలాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరం: ఈ రోజు రుణ బాధలు తొలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పాత మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. విందు, వినోదాల్లో గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వస్తులాభం ఉంటుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

కుంభం: ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులను కలిసి ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనం: ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు సత్ఫలితాలను అందిస్తాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మాటల చాతుర్యంతో అందరిని ఆకట్టుకుని ముందుకు సాగుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.

 

జై శ్రీమన్నారాయణ.

ఈ రోజు మీ రాశి ఫలాలు ఆదివారం 28 జూన్ 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *