Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు సోమవారం 29 జూన్ 2020

ఈ రోజు మీ రాశి ఫలాలు సోమవారం 29 జూన్ 2020

 

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

 

మేషం: ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తులాభం ఉంది. చేపట్టిన కార్యక్రమాలు, ప్రారంభించిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. వీలైనంతవరకు వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభం: ఈ రోజు వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. భూముల క్రయవిక్రయాల్లో స్వల్పలాభాలు పొందుతారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు ఉంటాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

మిధునం: ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వాహనయోగం ఉంటుంది వస్తులాభం అందుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకం: ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా లాభిస్తుంది. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. సోదరుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహం: ఈ రోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో స్వల్పమార్పులు ఉంటాయి. వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్య: ఈ రోజు ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. ధనలాభం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. శత్రువులు సమస్యలు సృష్టించినప్పటికీ వాటివి సమర్థవంతంగా అధిగమిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

తుల: ఈ రోజు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. వాహన సౌఖ్యముంది. అనవసర ఖర్చులు తగ్గించండి. సంఘంలో గౌరవంతో పాటు ఆదరణ పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. గతంతో పోలిస్తే వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

వృశ్చికం: ఈ రోజు సోదరుల నుంచి ఆస్తిలాభం పొందుతారు. నూతన విద్యావకాశాలు ఉంటాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

 

ధనస్సు: ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అనుకోని విధంగా ధనలాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. సంతానానికి నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరం: ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 

కుంభం: ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. సోదరుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలుగుతాయి. భూముల క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనం: ఈ రోజు ప్రారంభించిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. నూతన వస్తు సేకరణ ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.

 

జై శ్రీమన్నారాయణ.

ఈ రోజు మీ రాశి ఫలాలు సోమవారం 29 జూన్ 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *