Top Ad unit 728 × 90

మీ రాశిఫలాలు మంగళ వారం 11 ఫిబ్రవరి 2020

మీ రాశిఫలాలు మంగళ వారం 11 ఫిబ్రవరి 2020

 

మేష రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించండి. మరోవైపు ప్రేమ విషయంలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీరు ఈ సమయాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది.

 

వృషభరాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. వ్యాపారులకు కొంత కష్టంగా ఉంటుంది. మీరు త్వరలో మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే వివాహితులు వారి జీవిత భాగస్వామితో వాదించడం మానుకోవాలి. మీ వివాహ జీవితం సంతోషంగా మార్చుకునేందుకు మీరు మీ స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న మార్పు మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు మనసులో కొంత గందరగోళం ఉంటుంది. అయితే ప్రేమ విషయంలో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుందని ఆశిస్తారు. వివాహితులైతే ఈ రోజు తమ జీవిత భాగస్వామితో కొన్ని చిరస్మరణీయమైన క్షణాలు గడపడానికి అవకాశం పొందుతారు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు కొన్ని అకస్మిక సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మీరు వాటికి భయపడరు. వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. పనిలో ఈరోజు సరైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అప్పులు వంటివి తీసుకోకూడదు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.

న్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు మంచి మానసిక స్థితిలో ఉంటారు. ఈరోజు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే, అందుకు సంబంధించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఈరోజు ఓ మంచి సంస్థ నుండి ఉద్యోగ ఆఫర్ రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇలాంటి చెడు అలవాట్ల వల్ల, మీ ఆరోగ్యం రోజురోజుకు బలహీనపడుతోంది. మీరు సమయానికి జాగ్రత్తగా ఉంటే మంచిది. పనిలో ఈరోజు బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే పొదుపుపై ​​దృష్టి పెట్టండి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా మంచిగా అనుభూతి చెందుతారు. మీ తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు మీరు వారితో గొప్ప సమయం గడుపుతారు. మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, సరిగ్గా ఆలోచించిన తర్వాత మాత్రమే, మీ నిర్ణయం తీసుకోండి. సానుకూల మరియు ప్రతికూల అంశాలను చూడండి. ఆర్థిక పరంగా మెరుగుదల మంచిగానే ఉంటుంది. వ్యాపారులు ఈరోజు లాభం పొందే అవకాశం పొందవచ్చు.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు సరదాగా గడుపుతారు. ప్రేమ విషయానికొస్తే, ఈరోజు మీరు మొదటి చూపులోనే మీకు నచ్చిన వ్యక్తిని కలవవచ్చు. అయితే మీ భావోద్వేగాలను నియంత్రించాలి. మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి. మీ ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తగినంత సమయం నిద్ర పోవాలి. లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవు.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలు తినండి. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయండి. తద్వారా మీ బరువు నియంత్రించబడుతుంది. పనిలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆశించిన విధంగా ఫలితాన్ని పొందుతారు. అయితే ప్రశాంతమైన మనసుతో ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు లోతుగా ఉంటాయి. మీరు మీ భాగస్వామితో ఏవైనా అపార్థాలు ఉంటే తొలగించడానికి ప్రయత్నించాలి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులతో గడపడానికి అవకాశం లభిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎగతాళి అయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.

 

మీ రాశిఫలాలు మంగళ వారం 11 ఫిబ్రవరి 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *