Top Ad unit 728 × 90

మీ రాశిఫలాలు ఆదివారం 22 మార్చి 2020

మీ రాశిఫలాలు ఆదివారం 22 మార్చి 2020

 

మేష రాశి: ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి.

 

వృషభ రాశి: ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

 

మిథున రాశి: పాత మిత్రులను కానీ, దూర దేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి.

 

కర్కాటక రాశి: ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

 

సింహ రాశి: స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు.

 

న్యా రాశి: ఈరోజు గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పొకండి.

 

తులా రాశి: మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కొరకు పిల్లలతో గడపటం కానీ, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయటం మంచిది.

 

వృశ్చిక రాశి: ఆరోగ్య విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతీలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబసభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

 

ధనుస్సు రాశి: మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

 

మకర రాశి: ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. దానివలన మీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది.

 

కుంభ రాశి: స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

 

మీన రాశి: ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురిఅయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి.

మీ రాశిఫలాలు ఆదివారం 22 మార్చి 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *