Top Ad unit 728 × 90

మీ రాశిఫలాలు సోమవారం 11 మే 2020

మీ రాశిఫలాలు సోమవారం 11 మే 2020

 

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అనేక రకాలైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇలాంటి సమయంలో మీరు మీ ఖర్చులను వీలైనంత త్వరగా నియంత్రించడం మంచిది. పని విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రణాళిక ప్రకారం పని చేయాలి.

 

లక్షల మంది హృదయాలను ఆకర్షించిన శ్రీ వేంకటేశ్వరుని ఈ పాట మీరూ వినండి

 

వృషభరాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీని కారణంగా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ పనితీరు కూడా బాగుంటుంది. ఈరోజు ఎలాంటి సమస్యలైనా అధిగమించగలుగుతారు. మీ వివాహ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. ఈరోజు విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టాలి.

 

Bho shambho shiva shambo most popular Lord Shiva Song | భో శంభో శివ శంభో స్వయంభో

 

మిధున రాశి: ఈ రాశి వారు ఈరోజు పేదలకు సహాయం చేసే అవకాశం లభిస్తుంది. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది మిమ్మల్ని చాలా ఉత్సాహంగా ఉంచుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే మీకు ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా, విశ్రాంతి తీసుకోవాలి.

 

ఇప్పటివరకూ అరుణాచలం చూడనివారు ఈ వీడియో తప్పకుండా చూడండి | Aruncham Temple

 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని పరిష్కరించడం చాలా ముఖ్యం. ఉద్యోగులు ఈరోజు తెలివిగా పని చేయాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివాహితులకు తమ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరిస్తే, కొన్ని ప్రయోజనాలు పొందుతారు.

 

Bho shambho shiva shambo most popular Lord Shiva Song | భో శంభో శివ శంభో స్వయంభో

 

సింహ రాశి: ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ రోజు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హోటళ్లలో వ్యాపారం చేసేవారికి, రోజు భారీగా ఉండవచ్చు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మరోవైపు కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీకు తోబుట్టువులతో మంచి సంబంధం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. ముఖ్యంగా బదిలీల విషయంలో మీకు సానుకూల వార్తలు వినిపిస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

 

ఇప్పటివరకూ అరుణాచలం చూడనివారు ఈ వీడియో తప్పకుండా చూడండి | Aruncham Temple

 

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను కూడా వింటారు. అయితే వ్యాపారులకు ఈరోజు కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, అది మీ ఆలోచనా శక్తిని నాశనం చేస్తుంది. విద్యార్థులు ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలి, తద్వారా మీరు పరీక్షలో ఆశించిన ఫలితం పొందుతారు. ఈ రాశిచక్రంలోని మహిళలు తమ కోపాన్ని నియంత్రించాలి. ఈ రోజు మీ కోపం ఇంటి శాంతికి భంగం కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది.

 

Bho shambho shiva shambo most popular Lord Shiva Song | భో శంభో శివ శంభో స్వయంభో

 

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజు సరైన ఫలితాలను పొందవచ్చు. మీరు విద్యా రంగంలో ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే, మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపారులు లాభాలను కూడా ఆశించవచ్చు. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. శారీరకంగా మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

 

ఇప్పటివరకూ అరుణాచలం చూడనివారు ఈ వీడియో తప్పకుండా చూడండి | Aruncham Temple

 

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడి పని చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి. వ్యాపారులు కూడా ఈరోజు లాభాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఈరోజు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా కొంత సమస్య ఉంటుంది.

 

Bho shambho shiva shambo most popular Lord Shiva Song | భో శంభో శివ శంభో స్వయంభో

 

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈరోజు మీకు కొంత లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెంపు వంటి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే వ్యాపారులకు ఈరోజు నిరాశ ఎదురవుతుంది. మీరు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈ రోజు మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు.

 

ఇప్పటివరకూ అరుణాచలం చూడనివారు ఈ వీడియో తప్పకుండా చూడండి | Aruncham Temple

 

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు క్రమపద్ధతిలో పని చేస్తే, సాయంత్రంలోపు మీ పని అంతా సులభంగా పూర్తవుతుంది. ఈరోజు ఉద్యోగులకు ఉన్నతాధికారులు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పని చేయాలి. ముఖ్యంగా మీరంటే పడని సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులకు వ్యాపారం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి.

 

Bho shambho shiva shambo most popular Lord Shiva Song | భో శంభో శివ శంభో స్వయంభో

 

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీకు కుటుంబసభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం రావచ్చు. మరోవైపు ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కువ పనులు పెండింగులో పడిపోతాయి. ఆర్థిక పరంగా సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

 

ఇప్పటివరకూ అరుణాచలం చూడనివారు ఈ వీడియో తప్పకుండా చూడండి | Aruncham Temple

 

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగులు ఈ సమయంలో ఎలాంటి మార్పుల గురించి ఆలోచించకూడదు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. స్టాక్ మార్కెట్లో పని చేసే వారికి ఈరోజు కొంత ప్రయోజనం ఉండొచ్చు. అయితే కుటుంబ జీవితంలో ఈరోజు కొన్ని గొడవలు ఉంటాయి. మీరు సహనంతో వ్యవహరించాలి.

 

Bho shambho shiva shambo most popular Lord Shiva Song | భో శంభో శివ శంభో స్వయంభో

 

మీ రాశిఫలాలు సోమవారం 11 మే 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *