Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

రామమందిరానికి మూడేళ్లు చాలు...!

రామమందిరానికి మూడేళ్లు చాలు...!

 

 

ఆగస్టు 5న ఉత్తరప్రదేశ్‌లోని రామమందిరానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరుగనుంది. ఈ నేపథ్యంలో అతిరథ మహారథులు వస్తుండడంతో ఈ వైభవంగా నిర్వహించేందుకు యత్నిస్తున్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇక్కడ కుట్ర చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉండడంతో అన్ని చోట్లా భద్రతా చర్యలు తీసుకున్నారు. అయోధ్యలోని ప్రతి ఇంటినీ క్షణ్ణంగా పరిశీలన చేస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు.



ఒక వైపు మందిర నిర్మాణానికి శంకుస్థాపన, మరొక వైపు భద్రతకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తున్నది మోదీ ప్రభుత్వం. రామ మందిరంలో అయిదు గోపురాలతో మండపాలు, శిఖరం ఉంటాయి. ఆలయం ఎత్తు 161 అడుగుల వరకు ఉంటుంది. 10 ఎకరాల స్థలంలో మందిరం, మిగతా 57 ఎకరాల్లో వివిధ సముదాయాలను నిర్మిస్తారు. భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఢిల్లీ వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ కుమార్‌ గుప్తా చెప్పారు.



తాజాగా ఆగస్టు 5న భూమిపూజ చేస్తున్న నేపథ్యంలో మందిరం డిజైన్‌ ఎలా ఉంటుందన్న ఆసక్తి భక్తుల్లో నెలకొంది. మొదట అనుకున్న దానికంటే రెట్టింపు సైజులో మందిరాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగర శైలిలో మందిరం ఆకృతి ఉంటుందని తెలుస్తోంది. భారీ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆలయాన్ని డిజైన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌ చంద్రకాంత్‌ సోమ్‌పుర వెల్లడించారు. ఆలయ శిఖరం, రెండు గోపురాలు ఉండేలా గతంలో మందిరాన్ని డిజైన్‌ చేశారు. మూడేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుంది.



ఆలయాల నిర్మాణంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సోమ్‌పుర వంశస్తులు ప్రఖ్యాతి వహించారు. ఒకప్పుడు సోమనాథ్, అక్షరధామ్‌ ఆలయంతో పాటు 200పైగా ఆలయాలకు వీరు డిజైన్‌ చేశారు. ఇప్పుడు ఆ వంశానికి చెందిన చంద్రకాంత్‌ సోమ్‌పుర (77) తన ఇద్దరు కుమారులతో కలిసి రామ మందిర నిర్మాణానికి డిజైన్‌ రూపొందించారు. ఉత్తరాది ఆలయాల్లో కనిపించే నాగర శైలిలో మందిరం ఉంటుంది. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది.
 

రామమందిరానికి మూడేళ్లు చాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *