Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు గురువారం 22 ఫిబ్రవరి  2024

ఈ రోజు మీ రాశి ఫలాలు గురువారం 22 ఫిబ్రవరి  2024

 

డా.యం.ఎన్.చార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయంలో ఇతరులతో  విభేదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభించదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దీర్ఘ కాలిక ఋణాల నుండి ఊరట పొందుతారు. ఇంటాబయట కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. అకారణంగా  ఇతరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుకార్యములు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు సమయానికి నిద్రాహారాలు ఉండవు. వృధా ఖర్చుల విషయంలో ఆలోచించి ముందుకు ముందుకు సాగాలి. వ్యాపార పరంగా స్వలపధన నష్ట సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో  అధికారుల కోపానికి గురికావల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు అవసరానికి ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయట గౌరవమర్యాదలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. వ్యాపారాలలో కుటుంబ పెద్దల ఆలోచనలు కలసివస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలచివేస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలో  విరమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో చేయని పనికి నిందలు పడవలసివస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వ్యాపారపరంగా ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు పెద్దల ఆరోగ్య విషయంలో  శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నూతన గృహ వాహనయోగం  ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు స్ధిరాస్తి  క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన  ప్రోత్సాహకాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు మీ రాశి ఫలాలు గురువారం 22 ఫిబ్రవరి  2024 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *