Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 03 మార్చి 2024 

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 03 మార్చి 2024 

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీపేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతనకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ధన వ్యవహారాలు  ఒడిదుడుకుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దూరప్రయాణం సూచనలుఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. దైవ  చింతన పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు  ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహ  పరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. రావలసిన ధనం సమయానికి అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా రుణ ప్రయత్నాలు కలసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు ధన వ్యయ సూచనలు ఉన్నవి.స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ  పూర్తి కావు. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు వాహన  కొనుగోలుకు ఆటంకాలు  తొలగుతాయి. వ్యాపారం  పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులెదురవుతాయి. ఆరోగ్య విషయంలో  వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండిఅనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు ఆకస్మిక  ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సమాజంలో  కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 03 మార్చి 2024  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *