Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు  గురువవారం 11 ఏప్రిల్ 2024

ఈ రోజు మీ రాశి ఫలాలు  గురువవారం 11 ఏప్రిల్ 2024

 

డా.యం.ఎన్.చార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు  పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున  ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాలలో  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వృధా  ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి బయట పడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.  చేపట్టిన పనులు సకాలంలో  పూర్తి చేస్తారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  రుణాలు కొంత వరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్త్ర వస్తు  లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో  ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు జీవిత భాగస్వామి  నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన  విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు  ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి  బయటపడతారు. బంధు మిత్రుల నుండి  శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు  పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి  సాధిస్తారు. భూ సంభందిత  క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు  స్ధిరాస్తి  విషయంలో సోదరులతో  నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున  శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు  గురువవారం 11 ఏప్రిల్ 2024 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *