Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు  శుక్రవారం 12 ఏప్రిల్ 2024

ఈ రోజు మీ రాశి ఫలాలు  శుక్రవారం 12 ఏప్రిల్ 2024

 

డా.యం.ఎన్.చార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత  మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగమునకొన్ని  వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కొన్ని పనులలో  సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయమై  వైద్య సహాయం అవసరం అవుతుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు స్థిరాస్తి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు  నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు ముఖ్యమైన పనులలో  కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు  వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ  సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు  శుక్రవారం 12 ఏప్రిల్ 2024 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *