Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 09 జూన్ 2024 

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 09 జూన్ 2024 

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీపేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి  ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు వ్యయప్రయాసలతో కాని పనులు పూర్తి కావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు ఆరోగ్య ఈ విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు.  వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందువినోదాది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన  పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు దైవచింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. స్థిరస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 09 జూన్ 2024  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *