Top Ad unit 728 × 90

ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 10 జూన్ 2024 

ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 10 జూన్ 2024 

 

డా.ఎం.ఎన్.ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం, తార్నాక, హైదరాబాద్. ఫోన్:  9440611151

 

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీపేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ రోజు గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి  ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన  వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ రోజు కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో వివాదాలుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లబిస్తుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవాకార్యక్రమాలు పాల్గొంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ రోజు ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ రోజు దీర్ఘకాలిక  ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి  ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ రోజు గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ రోజు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన  పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ రోజు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ రోజు దూరపు  బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 10 జూన్ 2024  Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *