Top Ad unit 728 × 90

 వారఫలితాలు: తేదీ 15 నవంబర్ ఆదివారం నుండి శనివారం 21 నవంబర్‌ 2020 వరకు   

మేషం రాశి: ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. మీ ఆలోచనలు ఇతరులకు సైతం ఉపకరిస్తాయి. ఆర్థికంగా బలం పొందుతారు. రుణబాధల నుంచి క్రమేపీ ఒడ్డునపడతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. బంధువిరోధాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

 

వృషభం రాశి: అనుకున్న వ్యవహారాలు లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. కొన్ని విషయాలలో సహనం పాటించడం మంచిది. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ సత్తా నిరూపించుకునే సమయం. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలమైన సమయమని చెప్పాలి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 

మిథునం రాశి: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. ఒక సంఘటన మీలో కొంత మార్పులు తీసుకురావచ్చు. ఆర్థిక విషయాలు మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

 

కర్కాటకం రాశి: పని చేపట్టినా ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒప్పందాలు కొన్ని రద్దు చేసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు. వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనంగా బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

 

సింహ రాశి: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి విషయంలో వివాదాలు నెలకొనవచ్చు. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. కొన్ని కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలలో సామాన్యలాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవం. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి.

 

కన్యా రాశి: కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతనోత్సాహం. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. ధనవ్యయం. పసుపు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

 

తులా రాశి: పరిచయాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో చక్కదిద్దుతారు. ఆస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. వ్యూహాత్మకంగా వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత పనిఒత్తిడులు తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

 

వృశ్చిక రాశి: అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు కొంత దూరంగా ఉండండి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడులు ఉండవచ్చు. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగవు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

 

ధనుస్సు రాశి: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో విభేదిస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమ వృథా కాగల సూచనలు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొత్త సమస్యలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.

 

మకర రాశి: శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. అనుకున్న పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు. కోర్టు కేసులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విస్తరణ కార్యక్రమాలు నిలిపివేస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. వాహనయోగం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

 

కుంభ రాశి: కొత్త పనులకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. పెద్దల సలహాల మేరకు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనూహ్యంగా మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

 

మీన రాశి: వ్యయప్రయాసలు తప్ప వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకున్నదొక్కటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. సన్నిహితులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా మారుతుంది. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఓర్పు, నేర్పుతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడే అవకాశం. కళారంగం వారికి కొత్త చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. సోదరుల నుంచి ధనలాభం. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

 వారఫలితాలు: తేదీ 15 నవంబర్ ఆదివారం నుండి శనివారం 21 నవంబర్‌ 2020 వరకు    Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *