Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

బిగ్‌ షాక్‌ సోనూ సూద్‌ అంత పెద్ద 'నేరం' చేసేశాడా...!

బిగ్షాక్సోనూ సూద్అంత పెద్ద 'నేరం' చేసేశాడా...!

ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఏది తప్పు.? ఏది ఒప్పు.? అని జనం నిర్ణయించుకోలేనంత గందరగోళ పరిస్థితుల్ని పాలక పక్షం, ప్రతిపక్షం సృష్టిస్తుండడం గమనార్హం. సినీ నటుడు సోనూ సూద్‌, చిత్తూరు జిల్లాకి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకున్నాడు. రైతు కుటుంబానికి ట్రాక్టర్ని అందించాడు. అది కూడా, కుటుంబం పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకున్న గంటల వ్యవధిలోనే. కానీ, ఇక్కడే రాజకీయం షురూ అయ్యింది.

నిజానికి రైతు కుటుంబం మరీ అంత ఆర్థిక ఇబ్బందుల్లో లేదన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. 'ఉత్త ఆరోపణ మాత్రమే కాదు, కావాలంటూ సోషల్మీడియాలో సర్క్యులేట్అవుతోన్న వీడియో చూడండి.. అందులో ఇద్దరు అమ్మాయిలు నవ్వుతూ ఎంత ఉల్లాసంగా నాగలిని భుజాల మీద మోస్తూ నేలను దున్నుతున్నారో. ఇది సరదాకి ఇద్దరమ్మాయిలూ చేసిన పని. అంతే తప్ప, కష్టపడి చేస్తున్నది కాదు. కుటుంబం, ట్రాక్టర్ని ఏర్పాటు చేసుకోలేనంత పేద కుటుంబం కూడా కాదు. పైగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్సహా వ్యవసాయానికి సంబంధించిన సంక్షేమ పథకాలూ అందుతున్నాయి..' అన్నది వైసీపీ మద్దతుదారులు చెబుతున్నమాట. ప్రభుత్వం ఎంత గొప్పగా చేసినా, కుటుంబం పేద కుటుంబమని.. ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. సో, ఇక్కడ సోనూ సూద్చేసిన సాయంలో తప్పేమీ లేదు.

కానీ, సమస్య ఎక్కడొచ్చిందంటే.. సోనూ సూద్ని అభినందిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు మాట్లాడటం. రైతు కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లల చదువుల బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు ప్రకటించడంతో.. వ్యవహారం పొలిటికల్టర్న్తీసుకుంది. టీడీపీ - వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోందిప్పుడు. సదరు రైతు గతంలో లోక్సత్తా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశాడట కూడా. ఏం, అలా పోటీ చేస్తే అదేమన్నా నేరమా.? అన్నది ఇంకో ప్రశ్న. 'ఇలాంటి సాయాలు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని చెయ్యాలి..' అని సోనూ సూద్కి కొందరు సీనియర్జర్నలిస్టులూ ఉచిత సలహాలిచ్చేస్తున్నారు. 'అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు..' అన్నట్టుంది పరిస్థితి.

తరహా చెత్త రాజకీయాల కారణంగా సోనూ సూద్కూడా ఇకపై ఎవరికైనా సాయం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలేమో.! సోనూ సూద్ని ఆదర్శంగా తీసుకోవాలని ఇంకెవరైనా నిర్ణయించుకుంటే.. తక్షణం రాజకీయాల్ని చూపి ఆలోచనల్ని విరమించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 'ఆయన (సోనూ సూద్‌) ట్రాక్టర్ఇవ్వడం నేరమా.? అది చూసి నేను పేదోడినో, డబ్బున్నోడినో తెలుసుకునేందుకు అధికారులు మా ఇంటికి రావడం బాధ కలిగించింది.. మా రంగుని, శరీరాకృతిని ఎగతాళి చేస్తారా.?' అంటూ సదరు రైతు వాపోయాడు. టీ కొట్టు నడుపుకునే తనకు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, ఇబ్బందులు తట్టుకోలేక తన తండ్రి ఇంటికొచ్చి ఇక్కడే వుంటున్నామని అన్నాడాయన.

పొలం తన తండ్రిదనీ, దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే పథకాల తాలూకు సొమ్ములు తనకు దక్కవని చెప్పుకొచ్చాడు బాధితుడు నాగేశ్వరరావు. డమ్మీ అభ్యర్థిగానే తాను గతంలో బరిలోకి దిగాల్సి వచ్చింది తప్ప, తాను డబ్బున్నోడిని కాదని చెప్పాడు. ఇదీ నాగేశ్వరరావు అసలు కథ. ఇప్పటికైనా, టీడీపీ - వైసీపీ చేస్తోన్న చిత్ర విచిత్రమైన రాజకీయాలకు ఇక్కడితో ముగింపు పడుతుందని ఆశిద్దాం.

 

బిగ్‌ షాక్‌ సోనూ సూద్‌ అంత పెద్ద 'నేరం' చేసేశాడా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *