Top Ad unit 728 × 90

గుజరాత్‌ తీరంలో మాదకద్రవ్యాల పట్టివేత

గుజరాత్‌ తీరంలో మాదకద్రవ్యాల పట్టివేత

 

-విలువ రూ.16 కోట్లు ఉంటుందని అంచనా

 

దేవభూమి ద్వారకా: గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో సముద్రతీరాన నిషేధిత మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

ఆ సరకు విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.16 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ''స్థానిక పోలీసులు, ప్రత్యేక పోలీసుల బృందం (ఎస్‌వోజీ) రెండు రోజుల క్రితం సముద్ర తీరం వెంబడి గస్తీ తిరుగుతుండగా మూడు ప్లాస్టిక్‌ సంచులు కనిపించాయి. అందులో 30 ప్యాకెట్లలో 32 కేజీల చరాస్‌ ఉంది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.16 కోట్లు ఉండొచ్చు'' అని జిల్లా ఎస్పీ ఆదివారం తెలిపారు. ఈ సంచులు సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

 

గుజరాత్‌ తీరంలో మాదకద్రవ్యాల పట్టివేత Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *