Top Ad unit 728 × 90

త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు

త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు

 

అమరావతి: గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

నోటిఫికేషన్‌ జారీకి, ప్రిలిమ్స్‌ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, 'భారత సమాజం' చాప్టర్‌కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై కమిషన్‌ చురుగ్గా పరిశీలన చేస్తోంది. ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలనాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు... ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రశ్నపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొర్లడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షను ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.

 

త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *