Top Ad unit 728 × 90

జగిత్యాల లోని ఆ ఒక్క పాఠశాలకు మరో రూల్

తెలంగాణలోని పాఠశాలన్నింటికి ఓ రూల్... ఆ ఒక్క పాఠశాలకు మరో రూల్, తేడా ఏంటి?

 

పాఠశాలలన్నీ ప్రభుత్వ విధివిధానాలు అనుసరించి నడుస్తాయి. స్కూలు ఎప్పుడు ప్రారంభం కావాలి...? ఏం టైంకి ప్రారంభం కావాలి?

 

లంచ్ టైం ఎంతసేపు ఉండాలి? ఎప్పుడు పాఠశాల టైం అయిపోవాలి...? ఇవన్నీ అధికారులు ఓ టైం టేబుల్ ప్రిపేర్ చేసి మరీ అన్ని పాఠశాలలకు పంపిస్తారు. కానీ, ఆ ఒక్క పాఠశాల మాత్రం కొంచెం తేడాగా ఉంది. ఏంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం తెలంగాణలోని పాఠశాలలు అన్నింటిలో తరగతులు నడుస్తున్నాయి. కానీ, ఆ ఒక్క పాఠశాలలో మాత్రం తరగతులు నడవడం లేదు. అసలు స్కూల్కి విద్యార్థులే రావడం లేదు. గత 15 రోజలు నుంచీ ఇదే తంతు. అక్కడ చదువుకునే విద్యార్థులు ఏ పది మందో... 50 మందో కాదు... ఏకంగా 500 మంది. ఎవ్వరూ రావడం లేదు. ఏకంగా పాఠశాలకు సెలవులే ఇచ్చేశారు అధికారులు. ఎందుకు? ఏం జరిగింది? అక్కడ ఆ రూల్ ఏంటి అనుకుంటున్నారా? వివరాలివే...

 

అది జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లిలోని ఎస్సీ బాయ్స్ గురుకులం. సొంత బిల్డింగ్ లేకపోవడంతో ఆఫీసర్లు ఓ ప్రైవేట్బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఏమాత్రం క్వాలిటీ లేకుండా నిర్మించిన ఈ బిల్డింగ్ ఇటీవలి వానలకు దారుణంగా తయారైంది. వర్షం పడితే చాలు, గోడలు, స్లాబ్ ఉరుస్తున్నాయి. కిటికీలకు డోర్స్ లేకపోవడంతో హాస్టల్ రూముల్లోకి వాన నీరు చేరుతోంది. రాత్రిళ్లు వానపడితే పడుకునే పరిస్థితి లేకపోవడంతో స్టూడెంట్స్ తెల్లవార్లు జాగారం చేస్తున్నారు.

 

 

ఈ బిల్డింగ్ లోతట్టు ప్రాంతంలో ఉండటంతో చుట్టూ నీరు చేరి బయట అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. పైగా వరద నీటి వల్ల గురుకులం ప్రాంగణంలోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 15 రోజుల కిందట ప్రహరీ గోడ కూలింది. అదృష్టవశాత్తు స్టూడెంట్స్‌కు ఏమీ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాము స్కూల్‌ను నిర్వహించలేమంటూ ప్రిన్సిపల్, టీచర్లు చేతులెత్తేశారు. పై ఆఫీసర్ల నుంచి పర్మిషన్‌ తీసుకుని 15 రోజుల కిందట సెలవులు ప్రకటించారు. దీంతో ఇళ్లకు వెళ్లిపోయారు విద్యార్థులు.

 

అయితే పదిహేను రోజులవుతున్నా ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. ఇలా అర్ధంతరంగా సెలవులు ప్రకటిస్తే ఎలా అని వాపోతున్నారు. ఇప్పటికే 15 రోజులైందని తమ పిల్లలు మిగతా విద్యార్థులతో పోలిస్తే చదువులో వెనకబడే అవకాశం ఉందని కూడా వాదిస్తున్నారు.

 

జగిత్యాల లోని ఆ ఒక్క పాఠశాలకు మరో రూల్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *