Top Ad unit 728 × 90

ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల.

ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

 

ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేసింది.

 

అర్హులైన అభ్యర్థులు recruitment.itbpolice.nic.in ఐటీబీపీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 112 పోస్టులను భర్తీ చేయనున్నారు.

 

రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 7న ప్రారంభమై, 2024 ఆగస్టు 5న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

 

అర్హత...

ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు... గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన సైకాలజీ సబ్జెక్టుగా తత్సమాన ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

 

ఎంపిక ప్రక్రియ...

ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024లో నియామక పరీక్ష ఉంటుంది. ఆన్లైన్లో అడ్మిట్ కార్డులు జారీ చేసిన అభ్యర్థులు ఫైనల్గా ఎంపికయ్యే వరకు తాత్కాలికంగానే ఉంటారని, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ దశలో సంబంధిత డాక్యుమెంట్లు/ సర్టిఫికెట్లను ఒరిజినల్, నిర్దేశిత ఫార్మాట్లో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కు హాజరు కావాల్సి ఉంటుంది.

 

రాతపరీక్షలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.

 

దరఖాస్తు ఫీజు...

ఈ రిక్రూట్మెంట్ దరఖాస్తు చేసుకునే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు వెబ్సైట్లో ఆన్లైన్ పేమెంట్ గేట్వే సిస్టమ్ ద్వారా దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈ-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్సైట్ని చూడవచ్చు.

 

నోటిఫికేషన్ పూర్తి వివరాలు...

యూకో బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్...

యూకో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు యూకో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ucobank.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 544 పోస్టులను భర్తీ చేయనున్నారు.

 

యూకో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికిి లాస్ట్ డేట్ జూలై 16. యూకో బ్యాంక్ లో అప్రెంటిస్ జాబ్ కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలచే ఆమోదించబడిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వారి గ్రాడ్యుయేషన్ ఫలితాలను 01.07.2024 లోగా ప్రకటించి ఉండాలి. అభ్యర్థి మార్క్ షీట్లు, విశ్వవిద్యాలయం / ఇన్స్టిట్యూట్ / కళాశాల నుండి జారీ చేసిన ప్రొవిజనల్ / డిగ్రీ సర్టిఫికేట్ ను బ్యాంకు కోరినప్పుడు సమర్పించాలి. అభ్యర్థి 02.07.1996 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *