Top Ad unit 728 × 90

డిగ్రీ అర్హతతో... ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలు...!

డిగ్రీ అర్హతతో... ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలు...!

 

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది.

 

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో కాంట్రాక్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్‌, గ్రూప్ డిస్కషన్స్‌, ఇంటర్య్వూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులకు నెలకు 30వేల రూపాయల వేతనం ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకునేందుకు ఏప్రిల్ 5, 2024 చివరితేదిగా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.ippbonline.com/ ఈ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

 

ఇతర వివరాలు ఇలా ఉన్నాయి...

ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం: 47

 

విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

వయస్సు:  01-03-2024 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

 

వేతన వివరాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30వేల రూపాయల వరకు వేతనం వస్తుంది.

 

ఉద్యోగాలకు ఎంపిక చేయు విధానం: ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

 

దరఖాస్తు ఫీజు: ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునే జనరల్ అభ్యర్థులకు రూ.750 ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం 150 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఏప్రిల్‌ 5, 2024 చివరితేదిగా నిర్ణయించారు.

 

డిగ్రీ అర్హతతో... ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *