Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానం రూపుదిద్దుకుంది...!

యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానం రూపుదిద్దుకుంది...!

 

ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020 లో మాట్లాడుతూ కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2020 నిర్వహించడం సవాల్ అని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో విధమైన కార్యక్రమాలను జరపడం విశేషమని పేర్కొన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేలో కాలేజీలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి మోదీ మీడియాతో మాట్లాడారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులతో మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన గ్రాండ్ ఫినాలేకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి తోడ్పడతాయని చెప్పారు. ఇంత భారీగా ఆన్ లైన్ ద్వారా హ్యాకథాన్ నిర్వహించడం చెప్పుకోదగిన విషయమని... యువతకు గతంతో పోలిస్తే బాధ్యత పెరిగిందని చెప్పారు.

21 శతాబ్దంలో పరిశోధన, ఆవిష్కరణలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని... జాతీయ విద్యా విధానం ఇందుకోసం దోహదపడుతుందని తెలిపారు. యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానం రూపుదిద్దుకుందని చెప్పారు. నూతన విద్యా విధానం విద్యార్థులకు బ్యాగుల భారాన్ని తగ్గిస్తుందని... జీవితానికి ప్రయోజనం చేకూరేలా విద్యా విధానం ఉంటుందని అన్నారు.

 

యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానం రూపుదిద్దుకుంది...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *